|

ఎంతకాలం కాదు...ఎలా బతికామన్నది ముఖ్యం : జగన్‌


జనసంద్రమైన కాకినాడ నేతాజీపార్క్‌

కాకినాడ : జగన్‌ ఓదార్పుయాత్ర ముగింపు సభకు జనం భారీగా తరలి వాచ్చారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిలాల్లో 22 రోజులపాటు కొనసాగిన జగన్‌ యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా కాకినాడ నేతాజీ పార్క్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. యువనేత వైఎస్‌ జగన్‌కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. స్థానిక నేతాజీ పార్క్‌ జనసంద్రమైంది. సభాప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడింది. సభాస్థలికి జగన్‌ 8.45 నిమిషాలకు వచ్చారు.


ఎంతకాలం కాదు...ఎలా బతికామన్నది ముఖ్యం : జగన్‌

కాకినాడ : తన వ్యతిరేక వర్గంపై యువనేత వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఎంతకాలం బతికామన్నది కాదు... ఎలా బతికామన్నది ముఖ్యమని, ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించిన రోజు ఏ రాజకీయాలు లేవని, ఇపుడు దాన్ని వైఎస్‌ఆర్‌ వ్యతిరేకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఓదార్పుయాత్ర ఎందుకు చేయలేదని జగన్‌ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ చేసిందేమీ లేదని ఆయన వ్యతిరేకులు ఇపుడు ఏదేదో మాట్లాడి అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేవలం 10 నిమిషాలే మాట్లాడినా తన నాన్న వైఎస్‌ చేసిన మంచి పనుల గురించి చెబుతూనే తన వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. జగన్‌ రాక సందర్బంగా నేతాజీ పార్క్‌ జనసంద్రమైంది. ఈ సభతో జగన్‌పై అభిమానం ఉప్పెనలా పొంగిందనే చెప్పాలి.

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

Posted by Cine Gama on 17:41. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Blog Archive

Labels

interviews